విజయ్‌కి అభినందనలు.. దీదీకి సానుభూతి: ఎన్నికల ఫలితాలపై జగన్

  • తమిళనాడు ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏపీ మాజీ సీఎం జగన్
  • నటుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపిన జగన్
  • తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా నిలవడం గొప్ప విషయమని ప్రశంస
  • బెంగాల్ ఫలితాల నేపథ్యంలో దీదీకి సానుభూతి ప్రకటించిన జగన్
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ముఖ్యంగా తమిళనాడులో నటుడు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తొలి ఎన్నికల్లోనే సంచలన ప్రదర్శన చేయడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు జగన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

"నా ప్రియ సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. రాజకీయాల్లోకి వచ్చి, తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం నిజంగా గొప్ప విషయం. ప్రజాసేవలో మీరు ప్రారంభించిన ఈ కొత్త అధ్యాయంలో మీకు మరింత శక్తి, విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండాలి" అని జగన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అదే సమయంలో, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సరళిని ఉద్దేశిస్తూ అక్కడి పరిణామాలపై కూడా జగన్ స్పందించారు. "దీదీకి నా సానుభూతి తెలియజేస్తున్నాను. గెలుపు బాటలో ఉన్న బీజేపీకి, ఇతరులకు అభినందనలు" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 22 స్థానాల్లో గెలిచి 175 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, తమిళనాడులో విజయ్ పార్టీ 19 స్థానాల్లో నెగ్గి, మరో 88 స్థానాల్లో ముందుంజలో ఉంది. మొత్తమ్మీద విజయ్ పార్టీ తమిళనాడులో ప్రభంజనం సృష్టిస్తోంది.



Jagan Mohan Reddy
Tamil Nadu Elections
Vijay Thalapathy
Tamilaga Vettri Kazhagam
Tvk Party
West Bengal Elections
Mamata Banerjee
YSRCP
Indian Elections 2024
Assembly Elections

More Telugu News